రఫేల్‌పై రేపు పార్లమెంట్‌ ముందుకు కాగ్‌ నివేదిక | Sakshi
Sakshi News home page

రఫేల్‌పై రేపు పార్లమెంట్‌ ముందుకు కాగ్‌ నివేదిక

Published Mon, Feb 11 2019 7:01 PM

Government To Table CAG Report On Rafale Deal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా పెనుదుమారం రేపుతున్న రఫేల్‌ ఒప్పందంపై కాగ్‌ నివేదికను ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌ ముందుంచనుంది. ఫ్రాన్స్‌ కంపెనీ దాసాల్ట్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందు రఫేల్‌పై కాగ్‌ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్‌లో సమర్పించనుండటం గమనార్హం.

మరోవైపు రఫేల్‌ ఒప్పందం జరిగిన సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహర్షి ఈ ఒప్పందంపై ఆడిటింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది. కాగా కపిల్‌ సిబల్‌ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇక రఫేల్‌పై కాగ్‌ నివేదిక పార్లమెంట్‌లో మరిన్ని ప్రకంపనలకు దారితీస్తుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement