ఈపీఎఫ్‌ వడ్డీపై కేంద్రం కీలక నిర్ణయం

Government Notifies EPF Interest Rate For 2018-19 - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌)పై 8.65 శాతం వడ్డీ అందించాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2018–19 కాలానికి 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ వడ్డీరేటు 2017–18 కాలానికి 8.55గా ఉండేది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో సంస్థ ఇకపై చందాదారుల క్లెయిమ్‌లను 8.65 శాతం వడ్డీతో సెటిల్‌ చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపీఎఫ్‌ రేటును 8.65 శాతానికి పెంచుతూ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. (చదవండి: పండగ సీజన్‌కు ముందే చెల్లింపు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top