ఘజియాబాద్‌లో హృదయ విదారక ఘటన | Ghaziabad: Six people, including 5 children, electrocuted to death | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఆరుగురు మృతి

Dec 30 2019 11:38 AM | Updated on Dec 30 2019 11:44 AM

Ghaziabad: Six people, including 5 children, electrocuted to death - Sakshi

సాక్షి, ఘజియాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.  షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో ఓ చిన్నారి వయసు అయిదేళ్లు మాత్రమే. లోని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న బెహతా హాజీపూర్‌లోని మౌలానా ఆజాద్‌ కాలనీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు వీరంతా ఒకే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. మృతులు పర్వీన్‌ (40), ఫాతిమా (12), సహిమా (10), రతియా (8), అబ్దుల్‌ అజీమ్‌ (8), అబ్దుల్‌ అహద్‌ (5) గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement