'వాట్సాప్' తో నేరుగా ఉద్యోగాలు! | Get hired from home on WhatsApp | Sakshi
Sakshi News home page

'వాట్సాప్' తో నేరుగా ఉద్యోగాలు!

Feb 7 2016 11:29 AM | Updated on Apr 3 2019 5:32 PM

'వాట్సాప్' తో నేరుగా ఉద్యోగాలు! - Sakshi

'వాట్సాప్' తో నేరుగా ఉద్యోగాలు!

ద్యోగాలు సంపాదించడానికి ఆఫీసుల చుట్టూ తిరగడం ఒకప్పటిమాట.. టెలిఫోనిక్ రౌండ్ ద్వారా సెలక్ట్ చేసుకోవడం నిన్నటిమాట..

ముంబై: ఉద్యోగాలు సంపాదించడానికి ఆఫీసుల చుట్టూ తిరగడం ఒకప్పటిమాట.. టెలిఫోనిక్ రౌండ్ ద్వారా సెలక్ట్ చేసుకోవడం నిన్నటిమాట.. సోషల్ మీడియా సహాయంతో ఇంట్లో ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించటం నేటి మాట. ఇంటర్ నెట్ యుగంలో ఈ తంటాలు అవసరం లేదని భావించిన ఓ కంపెనీ సోషల్ మీడియాను తమ అభ్యర్థుల ఎంపికకు మార్గమని భావించింది. గుర్గావ్ కు చెందిన బోధిసత్వాదాస్ గుప్తా అనే క్రియేటివ్ డైరెక్టర్ 'వాట్సాప్'ను తన మాధ్యమంగా తీసుకున్నాడు.

వాట్సాప్ లో 'ది ఇంటర్న్ షిప్' అనే గ్రూప్ ఏర్పాటు చేసి ఉద్యోగాల కోసం చూస్తున్న విద్యార్థుల సమాచారాన్ని అప్ డేట్ చేశాడు. ఇటీవల జేవియర్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు చెందిన ఆరుగురు విద్యార్థులను వాట్సాప్ ద్వారా ఇంటర్వ్యూ చేసి యాడ్ ఏజెన్సీలో ఉద్యోగాలు కల్పించాడు. ఈ నూతన విధానంతో తమకు జాబ్స్ రావడంతో వారు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యానికి లోనయ్యారు. రెస్యూమ్ చూసి విద్యార్థులు, నిరుద్యోగుల టాలెంట్ ఎంటో తెలిసిపోతుందని, తమ చట్టుపక్కల ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తే వారికి కూడా జర్నీ టైమ్ కలిసొస్తుందని దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు.

ఇంటర్వ్యూల్లో ఇది కొత్త పద్దతి. అయితే ఈ విధంగా ఉద్యోగుల ఎంపిక అనేది సరైన ఇంటర్వ్యూ అని తాను అభిప్రాయపడట్లేదని ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వాహకుడు సాయ్ పద్వాల్ అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఇప్పటికే రిక్రూట్ అవుతున్నారని, రాబోయే రోజుల్లో సోషల్ మీడియా మరిన్ని మాధ్యమాల ద్వారా ఉద్యోగావకాశాలు పొందుతారని క్రియేటివ్ హెడ్ దాస్ గుప్తా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement