లంకేష్‌ హత్యకు ఆ ఒక్కరోజే రెండుసార్లు రెక్కీ | Gauri Lankesh Case? Killer Recced House Twice in One Day | Sakshi
Sakshi News home page

లంకేష్‌ హత్యకు ఆ ఒక్కరోజే రెండుసార్లు రెక్కీ

Sep 15 2017 12:22 PM | Updated on Sep 19 2017 4:36 PM

లంకేష్‌ హత్యకు ఆ ఒక్కరోజే రెండుసార్లు రెక్కీ

లంకేష్‌ హత్యకు ఆ ఒక్కరోజే రెండుసార్లు రెక్కీ

దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ కేసులో పురోగతి మొదలైంది. ఈ కేసును చేదించే దిశగా వెళుతున్న పోలీసులకు ఒక కీలక ఆధారం లభించినట్లు తెలుస్తోంది.

సాక్షి, బెంగళూరు : దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ కేసులో పురోగతి మొదలైంది. ఈ కేసును చేదించే దిశగా వెళుతున్న పోలీసులకు ఒక కీలక ఆధారం లభించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన రోజున హంతకుడు రెండుసార్లు ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. లంకేష్‌ ఇంటి బయట మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఒకసారి అలాగే 7గంటలకు మరోసారి అతడు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. ఆ వ్యక్తి తెల్ల చొక్క, బ్లాక్‌ హెల్మెట్‌ పెట్టుకొని స్కూటర్‌పై ఇంటిముందు నుంచి కొంచెం దూరం వెళ్లి తిరిగి స్కూటర్‌ మలుపుకొని మరోసారి ఆమె ఇంటివైపు చూస్తూ వెళ్లాడు.

ఆ తర్వాత రాత్రి 8.05గంటలకు ఆమె ఇంటి వద్దకు మరోసారి చేరుకొని సిద్ధంగా ఉన్నాడు. గౌరీ లంకేష్‌ వచ్చి చిన్నగేటు ద్వారా లోపలికి వెళ్లి కారు లోపల పెట్టేందుకు పెద్ద గేటు తీస్తుండగానే నేరుగా కాల్పులు జరిపి మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలో లభ్యమైన ఆధారాలతో కేసును చేదించే దిశగా ముందుకెళుతున్నామని, మరో పదిరోజుల్లో ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొలిక్కి వస్తుందని వారు భావిస్తున్నారు. ఎలాంటి ఆయుధాన్ని నిందితులు ఉపయోగించారనే విషయంపై ప్రశ్నించగా ప్రస్తుతం ఎలాంటి వివరాలు చెప్పబోమని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement