ఎస్‌ఎం కృష్ణ అ‍ల్లుడికి ఐటీ షాక్‌ | Former Karnataka Chief Minister SM Krishna's son-in-law's house raided | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎం కృష్ణ అ‍ల్లుడికి ఐటీ షాక్‌

Sep 22 2017 1:31 AM | Updated on Sep 22 2017 11:03 AM

Former Karnataka Chief Minister SM Krishna's son-in-law's house raided

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థకి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. సిద్ధార్థకు చెందిన పలు ప్రదేశాల్లో ఐటీ రైడ్స్‌ చేపట్టింది.

సాక్షి, బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థకి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. సిద్ధార్థకు చెందిన పలు ప్రదేశాల్లో ఐటీ రైడ్స్‌ చేపట్టింది. బెంగళూరు, ముంబై, చెన్నై, చిక్మగళూర్‌తో సహా 20కి పైగా ప్రాంతాల్లో ఐటీ రైడ్స్‌ జరుపుతోంది. కృష్ణ అల్లుడు సిద్ధార్థ కేప్‌ చైన్‌ కేఫ్‌ కాఫీ డే యజమాని. బెంగళూరులో కేప్‌ చైన్‌ కేఫ్‌ కాఫీ డే ప్రధాన కార్యాలయం ఉంది.
ఈ కార్యాలయంలో కూడా ఐటీ తనిఖీలు చేపడుతోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన ఎస్‌ఎం కృష్ణ ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.  ఆయన గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement