దాడికి ఇస్రో కూడా సాయం చేసిందా! | First major use of Cartosat images for Army | Sakshi
Sakshi News home page

దాడికి ఇస్రో కూడా సాయం చేసిందా!

Sep 30 2016 9:39 AM | Updated on Sep 4 2017 3:39 PM

దాడికి ఇస్రో కూడా సాయం చేసిందా!

దాడికి ఇస్రో కూడా సాయం చేసిందా!

భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి అనూహ్యంగా నిర్వహించిన దాడులకు భారత్ సాంకేతిక పరిజ్ఞానం కూడా విరివిగా ఉపయోగించింది.

బెంగళూరు: భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి అనూహ్యంగా నిర్వహించిన దాడులకు భారత్ సాంకేతిక పరిజ్ఞానం కూడా విరివిగా ఉపయోగించింది. ఈ దాడులకు ఇస్రో కూడా తన వంతు సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీ దాడి చేసిన ఉగ్రవాద శిబిరాలు, దాని చుట్టుపక్కల పరిస్థితులను దాడికి ముందే ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రించి భారత ఆర్మీకి కార్టోశాట్ 2సీ ఉపగ్రహం పంపించినట్లు సమాచారం.

ఈ ఏడాది జూన్ నెలలో భారత్ కార్టోశాట్ 2సీ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనిని ఆకాశంలో కన్ను' అని కూడా అంటారు. సున్నితమైన, దుర్బేద్యమైన ప్రాంతాలాల్లోని చిత్రాలను, వీడియోలను కూడా కార్టొశాట్ చిత్రించగలదు. ఇస్రోలోని కొన్ని వర్గాలు 'మేం చాలా రోజులుగా భారత ఆర్మీకి అవసరమైన చిత్రాలను, వీడియోలను పంపిస్తున్నాం. అయితే, ఏ సమయంలో, ఎప్పుడూ, ఎలాంటి చిత్రాలు అనే విషయాలు మాత్రం చెప్పలేము. కార్టోశాట్ తీసే చిత్రాలంటేనే ఆర్మీకి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పగలం' అంటూ తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement