ఎంపీ గవర్నర్పై ఎఫ్ఐఆర్ | fir to be filed on madhyapradesh governer ram naresh yadav | Sakshi
Sakshi News home page

ఎంపీ గవర్నర్పై ఎఫ్ఐఆర్

Feb 23 2015 5:39 PM | Updated on Sep 26 2018 3:27 PM

మధ్యప్రదేశ్లో సంచలం రేపిన పరీక్షలు, ఉద్యోగ నియమాకాల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్నరేశ్ యాదవ్పై కేసు నమోదుకు

మధ్యప్రదేశ్లో సంచలం రేపిన పరీక్షలు, ఉద్యోగ నియమాకాల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్నరేశ్ యాదవ్పై   కోర్టు అంగీకారం తెలపడంతో మంగళవారం నాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది

మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగాల నియమకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. కుంభకోణం ప్రధాన సూత్రధారి గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గవర్నర్ పాత్రపైనా అనేక ఆరోపణలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో  అటు కుమారుడితో పాటు తండ్రినీ విచారించేందుకు టాస్క్ ఫోర్స్ సిద్ధమైంది. రాంనరేశ్ రాజ్యాంగ పదవిలో ఉండటంతో హైకోర్టు అనుమతితో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement