​​కూతురిని గొలుసుతో బంధించిన తండ్రి | Father Ties Up 17 Year Old Daughter With Chain | Sakshi
Sakshi News home page

​​కూతురిని గొలుసుతో బంధించిన తండ్రి

Jul 15 2018 10:50 AM | Updated on Jul 15 2018 1:42 PM

Father Ties Up 17 Year Old Daughter With Chain - Sakshi

ఓ యువకుడితో స్నేహం చేస్తున్నాని, తన తల్లిదండ్రులు, సోదరులు కలిసి తన ఇంట్లో బంధించారని..

లక్నో : తన కూతురు ఓ యువకుడితో చనువుగా ఉంటోందని అనుమానించిన తండ్రి బాలిక (17) కాళ్లకు ఇనుప గొలుసు కట్టి ఇంట్లో బంధించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో శనివారం చోటుచేసుకుంది. తన తండ్రి గత మూడు రోజులుగా ఇనుస గొలుసుతో కట్టేసి ఇంట్లో బంధించాడని సమీపంలో మీర్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేసింది. తాను ఓ యువకుడితో స్నేహం చేస్తున్నాని, తన తల్లిదండ్రులు, సోదరులు కలిసి తన ఇంట్లో బంధించారని ఫిర్యాదులో పేర్కొంది. అర్థరాత్రి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో తప్పించుకుని వచ్చి పోలీస్‌లను ఆశ్రయించినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రిని శనివారం అరెస్ట్‌ చేశారు.

మైనర్‌ బాలికను అక్రమంగా నిర్భందించారని ఐపీసీ సెక్షన్‌ 342 ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలికను మహిళ కానిస్టేబుల్‌ సహాయంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె మేజర్‌ అయ్యే వరకు బాలిక సంరక్షణ కేంద్రంలో ఉంటుందని అధికారులు తెలిపారు. బాలిక ఆరోపణలపై కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బరేలీ సూపరింటెండెంట్ సతీష్‌ కుమార్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement