కాంగ్రెస్‌కు బిహార్‌ నేత ఝలక్‌

ex bihar pcc chief ashok chaudhary meet pm modi - Sakshi

మోదీ సభకు హాజరమైన బిహార్‌ మాజీ పీసీసీ చీఫ్‌

ప్రధాని మోదీ, సీఎం నితీష్‌లతో సంభాషణ

జేడీయూలో చేరడంపై ఊహాగానాలు

సాక్షి, పట్నా: బీహార్‌ కాంగ్రెస్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నమొన్నటివరకూ బిహార్‌ పీసీసీగా వ్యహరించిన అశోక్‌ చౌదరిను ఆ పదవి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా తప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో అశోక్‌ చౌదరి అనూహ‍్యంగా ప్రధానిని కలిసి కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చారు. పట్నా యూనివర్సిటీ శత వసంతాల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బిహార్‌ మాజీ పీసీసీ చీఫ్‌ అశోక్‌ చౌదరి పాల్గొనడంతో పాటు.. మోదీ, నితీష్‌ కుమార్‌తో ప్రత్యేకంగా సంభాషించారు. అనంతరం సీఎం నితీష్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనతో ఆశోక్‌ను కాంగ్రెస్‌ పార్టీ వెంటనే సస్పెండ్‌ చేస్తుందేమో అని చమత్కరించారు.

పార్టీని చీల్చేందుకు అశోక్‌ చౌదరి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో కాంగ్రెస్‌ అతన్ని పార్టీ చీఫ్‌ పదవి నుంచి గత నెల్లో తప్పించింది. అప్పటినుంచి అవకాశం చిక్కిన ప్రతిసారీ.. అశోక్‌ చౌదరి కాంగ్రెస్‌ పార్టీ అధినాయత్వం మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో తత్సబంధాలున్న అశోక్‌ చౌదరి.. జేడీయూలో చేరుతారనే ఊహాగానాలు కొంతకాలంగా ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top