
నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా
సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా మృతిచెందారు.
సాక్షి, చెన్నై: సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా మృతిచెందారు. కొంత కాలంగా నీలబ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు.
నీలబ్ విశ్రా వయసు 57 ఏళ్లు. నేషనల్ హెరాల్డ్ పత్రిక రీలాంచ్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎడిటర్ నీలబ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.
An Editor's Editor. A man who spoke truth to power. An institution builder. On Neelabh Mishra's tragic passing away this morning, my deepest condolences to his family, friends, colleagues and admirers. #NationalHerald
— Office of RG (@OfficeOfRG) February 24, 2018