రూ.16 కోట్ల జకీర్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ | ED attaches properties of Zakir Naik worth Rs 16 crore in Mumbai, Pune | Sakshi
Sakshi News home page

రూ.16 కోట్ల జకీర్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌

Jan 20 2019 5:29 AM | Updated on Jan 20 2019 5:29 AM

ED attaches properties of Zakir Naik worth Rs 16 crore in Mumbai, Pune - Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయక్‌కు సంబంధించిన రూ. 16.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈ ఆస్తులను జప్తు చేసినట్లు శనివారం వెల్లడించింది. జకీర్‌ కుటుంబసభ్యుల పేరిట ముంబై, పుణేలో ఉన్న ఈ స్థిరాస్తులను ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద జప్తు చేసినట్లు పేర్కొంది. జకీర్‌ బ్యాంక్‌ ఖాతాకు వచ్చిన విరాళాలను తన భార్య, కొడుకు, మేనకోడలు అకౌంట్లకు పంపినట్లు ఆధారాలు సేకరించిన ఈడీ ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో ముంబైలోని ఫాతిమా హైట్స్, ఆఫియా హైట్స్‌ భవంతులతో పాటు బాందప్‌ ప్రాంతంలోని ఆస్తులు, పుణేలోని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement