భూ కుంభకోణం కేసులో వాద్రాకు ఈడీ షాక్‌

ED Attaches Assets of Robert Vadra  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమాస్తుల కేసులో మనీల్యాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు బికనీర్‌ భూ కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి వాద్రా కంపెనీ స్కైలైట్‌ హాస్పిటాలిటీ లిమిటెడ్‌కు చెందిన రూ 4.62 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్‌ చేసింది.

ఇదే కేసులో మరికొందరి ఇతరుల ఆస్తులనూ ఈడీ అటాచ్‌ చేసింది. భూ నిర్వాసితులకు కేటాయించిన భూమిని రాబర్ట్‌ వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ కేవలం రూ 72 లక్షలకే  దాదాపు 150 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అదే భూమిని రూ 5.15 కోట్లకు అలిగెన్సీ అనే కంపెనీకి విక్రయించారని ఈడీ ఆరోపిస్తోంది. అక్రమ లావాదేవీ ద్వారా ఆయన మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ వాద్రాపై అభియోగాలు మోపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top