
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యోగి వ్యాఖ్యలపై ఈసీ ఆయనకు నోటీసు జారీ చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షహీన్‌బాగ్‌కు బిర్యానీలు సరఫరా చేస్తున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఈసీ గురువారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయవాదం, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే మరోవైపు కాంగ్రెస్, కేజ్రీవాల్ విభజిత శక్తులకు తోడ్పాటు అందిస్తున్నారని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఉగ్రవాదంపై మోదీ సర్కార్ రాజీలేని పోరు జరుపుతుంటే షహీన్‌బాగ్ ఆందోళనలకు మద్దతిస్తూ నిరసనకారులకు బిర్యానీ తినిపిస్తున్నారని మండిపడ్డారు. యోగి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఈనెల 7 సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా 11న ఫలితాలను వెల్లడిస్తారు.