ఫుడ్‌ బాగా లేదన్న పాపానికి..!? | Eatery owner flings hot oil onto customer | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ బాగా లేదన్న పాపానికి..!?

Nov 9 2017 1:56 PM | Updated on Nov 9 2017 2:02 PM

Eatery owner flings hot oil onto customer - Sakshi

ముంబై : రోడ్‌సైడ్‌ హోటల్‌లో ఫుడ్‌ బాగా లేదన్న ఓ కస్టమర్‌పై సలసల కాగే నూనె పోసేందుకు ప్రయత్నించాడో యజమాని. షాకింగ్‌కు గురి చేసే ఈ ఘటన ముంబై శివారులోని ఉల్లాస్‌ నగర్‌లో జరిగింది. రోడ్‌ పక్కగా ఉండే ఓ హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. తింటున్న టిఫిన్‌ రుచిగా లేదని చెప్పాడు. అంతేకాక ఇంత చట్నీలు కూడా సరిగ్గా లేవని యువకుడు హొటల్‌ యజమానితో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాక టిఫిన్‌ చేసేందుకు వస్తున్న ఇతర కస్టమర్లతో.. ఇక్కడ టిఫిన్‌ బాగాలేదని యువకుడు చెప్పడంతో హోటల్‌ యజమానికి ఆగ్రహం తెప్పించింది.

గొడవ పెట్టుకున్న కస్టమర్‌పై కోపం తెచ్చుకున్న హోటల్‌ యజమాని అతనిమీద సలసల మరిగే నూనెను పోసేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన కస్టమర్‌ అక్కడనుంచి పారిపోయాడు. అయినా అతని మీద నూనె పోసేందుకు హోటల్‌ యజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటన అంతా అక్కడ ఉండే సీసీటీవీలో రికార్డయింది. కస్టమర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి.. సదరు హోటల్‌ యజమానిపై కేసును నమోదు చేశారు పోలీసులు

ఫుడ్‌ బాగా లేదన్న కస్టమర్‌పై హోటల్‌ యజమాని గొడవ 

Advertisement
 
Advertisement
Advertisement