విజయవంతంగా ‘అభ్యాస్‌’

DRDO successful flight test of ABHYAS from Chandipur - Sakshi

భువనేశ్వర్‌: భారత్‌ సోమవారం అభ్యాస్‌–హైస్పీడ్‌ ఎక్స్‌పాండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌(హీట్‌) అనే డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌రేంజ్‌లో ఈ పరీక్షను భారత రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సోమవారం నిర్వహించింది. ఆటోపైలట్‌ వ్యవస్థ సాయంతో అభ్యాస్‌ ముందుకు దూసుకెళుతుంది. ఇందులో చిన్న గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్‌ నేవిగేషన్‌ వ్యవస్థను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు. ఈ ప్రయోగంలో అభ్యాస్‌ నిర్దేశిత ప్రమాణాలన్నింటిని అందుకుందని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top