‘ఆధార్‌’ షేర్‌ చేయకండి!

Don't Share ID, Aadhaar Body Advises After Telecom Regulator's Challenge - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ సంఖ్యను ఆన్‌లైన్‌లో, సోషల్‌ మీడియాలో బహిరంగంగా ఇతరులతో పంచుకోవద్దని, ఆధార్‌ సంఖ్య ఆధారంగా తమ వివరాలను వెల్లడించాలని సవాల్‌ చేయొద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) పౌరులకు సూచించింది. ఇతరుల ఆధార్‌ సంఖ్యతో లావాదేవీలు చేయడం చట్టవ్యతిరేకమని, దాన్ని నేరంగా పరిగణిస్తామంది. ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ తన ఆధార్‌ సంఖ్యను బహిరంగంగా వెల్లడించి, దుర్వినియోగం చేయాలంటూ సవాల్‌ చేసిన విషయం, దాంతో స్పందించిన హ్యాకర్లు ఆయన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు సహా పూర్తి సమాచారాన్ని సంగ్రహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూఐడీఏఐ ఈ సూచన చేసింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top