తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలు | DMK protests against Jallikattu ban, Stalin slams Prime Minister | Sakshi
Sakshi News home page

తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలు

Jan 14 2017 2:25 AM | Updated on Sep 5 2017 1:11 AM

జల్లికట్టుపై నిషేధాన్ని ఉల్లంఘిస్తూ మదురై సమీపంలోని ఓ గ్రామంలో శుక్రవారం జల్లికట్టు నిర్వహించారు.

తక్షణ ఆర్డినెన్స్‌కు స్టాలిన్‌ డిమాండ్‌
సాక్షి ప్రతినిధి, చెన్నై: జల్లికట్టుపై నిషేధాన్ని ఉల్లంఘిస్తూ మదురై సమీపంలోని ఓ గ్రామంలో శుక్రవారం జల్లికట్టు నిర్వహించారు. జల్టికట్టు కోసం చేస్తున్న నిరసన ప్రదర్శనల్లో భాగంగా కొందరు యువకులు ఐదు ఎద్దుల్ని మైదానంలోకి వదిలారని స్థానిక పోలీసులు చెప్పారు.  జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలంటూ చెన్నైలో జరిగిన ఆందోళనలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై స్టాలిన్‌ ధ్వజమెత్తింది. సినీ నటులు, ఇతరులను కలిసేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ ఏఐఏడీఎంకే ఎంపీలకు మాత్రం సమయం కేటాయించలేదని స్టాలిన్‌ విమర్శించారు. జల్లికట్టు నిర్వహణకు వీలుగా కేంద్రం  ఆర్డినెన్సు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement