
'మమ్మల్ని కర్ణాటక సర్కార్ ఆదేశించలేదు'
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బతగిలినట్లయింది. దర్యాప్తు విషయంలో కాల పరిమితి విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పష్టం చేసింది.
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బతగిలినట్లయింది. దర్యాప్తు విషయంలో కాల పరిమితి విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పష్టం చేసింది. కర్ణాటక రాష్ట్రంలో ఐఏఎస్ అధికారి డీకే రవి చనిపోవడం పలు అనుమానాలకు దారి తీసిన విషయం తెలిసిందే. రవి ఆత్మహత్య చేసుకోలేదని, ఆయన చనిపోవడం వెనుక ఎవరోఒకరి హస్తం ఉండే ఉంటుందని ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు లేవనెత్తిన నేపథ్యంలో ఆ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయంలోగా దర్యాప్తును పూర్తి చేస్తారా అని ప్రశ్నించగా సీబీఐ వర్గాలు ఈ విధంగా స్పందించాయి.
కాల పరిమితి విధించి ఆలోగా విచారణ పూర్తి చేయాలని ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే ఆదేశాలివ్వగలవని చెప్పింది. అయితే, ఈ కేసు కుటుంబ నేపథ్యానికిగానీ, లేక ల్యాండ్ మాఫియాకుగానీ పరిమితమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రవి తన బ్యాచ్ మేట్ అయిన మహిళా ఐఏఎస్తో ప్రేమలో ఉన్నాడని, ఆ ప్రేమలో విఫలం అవడంవల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. చనిపోవడానికి ముందు రవి తన ఫోన్నుంచి 'నా చావు వార్త విన్నాక తప్పకుండా నా వద్దకు రా.. నన్ను చూడు.. మనం బహుషా మరో జన్మలో కలుసుకుంటామేమో' అని వాట్సాప్లో ఓ మెస్సేజ్ పంపించినట్లు తెలిసింది.