అభిమానుల నుంచి దిశాను కాపాడిన: టైగర్‌

Disha Patani Mobbed By Fans Tiger Take Rescue In Mumbai - Sakshi

ముంబై: బాలీవుడ్‌ అందాల నటి దిశా పటానికి చేదు అనుభవం ఎదురైంది. తన 26వ పుట్టిన రోజు సందర్భంగా దిశా తరుచూ వెళ్లే బేస్టియన్‌ రెస్టారెంట్‌కి.. తన బాయ్‌ ఫ్రెండ్‌ టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది.  అయితే ఆమె రాక తెలుసుకున్న దిశా అభిమానులు.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకోడానికి అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. వారంతా ఒక్కసారిగా దగ్గరికి రావడంతో ఆమె కిందపడబోయారు. దీంతో వెంటనే తేరుకున్న ష్రాఫ్‌ ఆమె పడకుండా చేయిపట్టుకుని రక్షించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టైగర్‌ ష్రాఫ్‌తో పాటు సన్నిహితుల మధ్య  దిశా పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ మూవీలో దిశా పటాని నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top