బెంగాల్‌లో తృణమూల్‌, బీజేపీ బాహాబాహీ..

Dilip Ghoshs Car Vandalised Three Critically Injured In BJP TMC Scuffle - Sakshi

సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నపూర్‌ జిల్లాలో బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాలు ఎదురుపడటంతో జరిగిన ఘర్షణలో బీజేపీ బెంగాల్‌ చీఫ్‌ దిలీఫ్‌ ఘోష్‌ కారును తృణమూల్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మిడ్నపూర్‌ జిల్లాలోని కాంటై ప్రాంతంలో బీజేపీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దిలీష్‌ ఘోష్‌, సహా పలువురు బీజేపీ నేతలు హాజరవుతుండగా, అదే ప్రాంతంలో తృణమూల్‌ కార్యాలయం ఉండటంతో ఉద్రిక్తత  నెలకొంది.

బీజేపీ నేతల వాహనాలకు తృణమూల్‌ కార్యకర్తలు నల్లజెండాలు చూపడం, పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రతిగా బీజేపీ ​కార్యకర్తలు ప్రతి నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో 15 కార్లు ధ్వంసమయ్యాయి. ఇరు పార్టీలకు చెందిన ఐదుగురు గాయపడగా, వీరిలో ముగ్గురి పరిస్ధితి ఆందోళనకరంగా ఉందన్నారు. తృణమూల్‌ దాడిలో తాను తృటిలో తప్పించుకున్నానని, ప్రజాస్వామ్యయుతంగా తమను ఎదుర్కోలేని తృణమూల్‌ తమపై గూండాలు, పోలీసులను ప్రయోగిస్తోందని బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీఫ్‌ ఘోష్‌ ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top