సాధువులకు కూడా పెన్షన్‌ ఇవ్వాలి

Digvijay Singh Said People Wearing Saffron Robes Molesting Inside Temples - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించి.. పొడులమ్ముకునేవారు.. ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ని ఉద్దేశిస్తూ.. దిగ్విజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌ ఆధ్యాత్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్‌ సమాగమ్‌ కార్యక్రమానికి దిగ్విజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌ మాట్లాడుతూ.. ‘పురాతన సనాతన ధర్మాన్ని విస్మరించే వారిని దేవుడు కూడా క్షమించాడు. ప్రస్తుత సమాజంలో కాషాయ వస్త్రాలు ధరించి పొడులమ్ముకునే వారు కొందరు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారు. అలానే కొందరు వ్యక్తులు జై శ్రీ రాం నినాదాన్ని హై జాక్‌ చేశారు. రాముడి పేరిట నినాదాలు చేసే వీరు సీతను ఎందుకు మర్చిపోతున్నారు’ అని దిగ్విజయ్‌ ప్రశ్నించారు.

దిగ్విజయ్‌ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ వేదిక మీదనే ఉండటం విశేషం. అలానే ఈ కార్యక్రమానికి హాజరైన కంప్యూటర్‌ బాబా సాధువుల తరఫున మాట్లాడుతూ.. ఆలయాలకు ప్రభుత్వ భూముల్ని కేటాయించాలని.. వాటికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని.. అంతేకాక సాధువులుకు కూడా వృద్ధాప్య పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top