అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

Dhanan Manjhi Life Turned after One Year  - Sakshi

కలహండి : సరిగ్గా ఏడాది క్రితం ఓ వ్యక్తి చనిపోయిన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కూతురితో కలిసి 10 కిలో మీటర్లు పైగా నడిచిన ఒడిశా వ్యక్తి కథనం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆంబులెన్స్‌ను నిరాకరించగా.. దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబ పెద్ద దనా మాఝీ అలా చేశాడంటూ చెప్పుకున్నాం. 

కానీ, అదే దనా మాఝీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీస్తే విస్తూ పోవాల్సిందే. మళ్లీ పెళ్లి చేసుకున్న ఆయన ప్రధాన మంత్రి గ్రామీణ్‌ ఆవాస్‌ యోజన కింద ఓ ఇంటిని కట్టేసుకున్నాడు. పలువురు దాతలు అందించిన సహకారంతో ఇప్పుడు అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది. అందులో బహ్రైన్‌​ ప్రధాని ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీపా అందించిన 9 లక్షల సాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు కనీసం బ్యాంక్‌ అకౌంట్‌ కూడా లేని అతను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌తో అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. భువనేశ్వర్‌లో అతని ముగ్గురి కూతుళ్లకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందిస్తోంది.      

గతేడాది ఆగష్టు లో అతని ఉదంతం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 16 నెలల తర్వాత తన భార్య శవంతో నడిచిన అదే రోడ్డుపై 65 వేలు పెట్టి బైక్‌ను కొని నడిపి మరోసారి ధనా మాఝీ వార్తల్లోకెక్కాడు. మొత్తానికి ఆ ఘటన తన లైఫ్‌ను మార్చేసి  లక్షాధికారిని చేసిందంటూ మాఝీ ఆనందంగా చెబుతున్నాడు.

Back to Top