తప్పతాగి కారుతో మహిళ బీభత్సం..! | Delhi woman a drunk and drive | Sakshi
Sakshi News home page

తప్పతాగి కారుతో మహిళ బీభత్సం..!

Nov 17 2016 8:44 AM | Updated on May 25 2018 2:06 PM

తప్పతాగి కారుతో మహిళ బీభత్సం..! - Sakshi

తప్పతాగి కారుతో మహిళ బీభత్సం..!

ఓ మహిళ తప్పతాగి కారుతో బీభత్సం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

కర్నాల్: ఓ మహిళ తప్పతాగి కారుతో బీభత్సం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన ప్రీతి భరద్వాజ్(36) కారు(మారుతి స్విఫ్ట్)లో బుధవారం రాత్రి హర్యానాలోని కర్నాల్ సమీపంలోని జాతీయరహదారిపై వెళ్తోంది. రోడ్డు పక్కన వెళ్తున్న ఐదుగురు వ్యక్తులపై నుంచి ప్రీతి కారు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారని, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు పోలీసులు సమాచారం అందుకున్నారు.

వారు ఘటనా స్థలానికి చేరుకునేలోగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఢిల్లీ మహిళ కారును కొంతమేరకు ధ్వంసం చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పనుల్లో బిజీగా ఉన్న కొందరు వ్యక్తులను ఢిల్లీ మహిళ కారుతో ఢీకొట్టిందని, ఇద్దరు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారని స్టేషన్ ఇన్‌చార్జ్ రాజ్‌బీర్ సింగ్ యాదవ్ చెప్పారు. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా ఆమె అలాగె వెళ్తుండగా స్థానికులు ఛేజ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఆ సమయంలో కారులో ఆమె ఒక్కరే ఉన్నారని, మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేశారు. మృతులు రాజ్‌కుమార్, బన్సీలాల్ అని పోలీసులు గుర్తించారు. ప్రీతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని కర్నాల్ చేరుకున్న ప్రీతి పేరేంట్స్ ఈ ఘటనపై షాక్‌కు గురయ్యారు. ఢిల్లీ మహిళపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement