రెండు వారాల్లో ఇంగ్లీష్ గ్యారంటీ అంటూ... | delhi university graduate started robbery institute | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో ఇంగ్లీష్ గ్యారంటీ అంటూ...

Aug 8 2015 10:24 AM | Updated on Aug 30 2018 5:24 PM

రెండు వారాల్లో ఇంగ్లీష్ గ్యారంటీ అంటూ... - Sakshi

రెండు వారాల్లో ఇంగ్లీష్ గ్యారంటీ అంటూ...

'రెండు వారాల్లో ఇంగ్లీష్ గ్యారంటీ' అంటూ కోచింగ్ ఇచ్చే సెంటర్లను చూశాం.

న్యూ ఢిల్లీ: 'రెండు వారాల్లో ఇంగ్లీష్ గ్యారంటీ'  అంటూ కోచింగ్ ఇచ్చే సెంటర్లను చూశాం. అయితే...  ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో మాత్రం చోరీలు ఎలా చేయాలో నేర్పిస్తుంది. అది కూడా జస్ట్ రెండు వారాల్లోపేనట. కాగా ఆ కోచింగ్ సెంటర్ ఇంగ్లీష్ నేర్పిస్తామని... ప్రకటనలు ఇస్తుంది.  అయితే అందులో చేరేవారు రాంగ్ రూట్‌లోకి మళ్లినట్లే! అక్కడ ఇంగ్లిష్ మాత్రమే కాదు.. చోరీలూ నేర్పిస్తారు! ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే దొంగలకు కూడా కోచింగ్ సెంటర్ లు ఉండటం చూశాం. కానీ, ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ రాజీవ్ సహానీ అలాంటి ఓ కోచింగ్ సెంటర్ ని నిజంగానే ప్రారంభించాడు.

వివరాల్లోకెళితే.. యూపీలోని ఖరగ్‌పూర్‌కు చెందిన రాజీవ్ నిరుద్యోగి. ఇంగ్లిష్ కోచింగ్ ముసుగులో.. ఏటీఎం చోరీలకు పెద్ద ప్లాన్ వేశాడు. చురుకైన విద్యార్థులను ఎంచుకుని వారిని ప్రలోభపెట్టి చోరీలవైపు మళ్లించడం మొదలుపెట్టాడు. తొలుత థియరీ క్లాస్‌లు బోధించి, తర్వాత ఏటీఎం కేంద్రాలకు తీసుకెళ్లి మరీ ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చేవాడు. మహిళలు, వద్ధులకు సహాయం చేస్తున్నట్లు నటించి.. వారు పిన్ ఎంటర్ చేయగానే ఓ మైక్రోచిప్‌ను లేదా పిన్నును కీప్యాడ్‌లోపలికి చొప్పిస్తే స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది. దీంతో యంత్రం పనిచేయడం లేదు. వేరే చోటికి వెళ్లండని చెప్పి.. వారు వెళ్లిపోగానే మైక్రోచిప్‌ను తీసేసి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇదీ ప్లాన్.

ఈ పద్ధతిలోనే చోరీలు చేయిస్తూ.. టీమ్ సభ్యులకు కొన్నాళ్లు నెల జీతం ఇచ్చాడు. చోరీలు పెరగడంతో వారికి వాటాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు చిల్లిగవ్వ లేకుండా రోడ్లపై తిరిగిన రాజీవ్ కొద్దిరోజులకే హోండా సిటీ కారులో తిరిగేంతగా ఎదిగాడు. ఇంటికి వేలకు వేలు పంపేవాడు. కానీ.. ఎక్కడైతే ప్లాన్ వేసుకున్నాడో.. ఇప్పుడు అక్కడికే చేరాడు. 2011లో దొంగతనం కేసులో కొన్నాళ్లు జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీ ద్వారా ఏటీఎం చోరీల గురించి తెలుసుకున్నాడు. తాజాగా ఎంత పక్కాగా పనికానిచ్చినా.. పోలీసులకు దొరికిపోవడంతో మరోసారి కటకటాల వెనక్కి చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement