ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అశోక్ విహార్లో మోటార్ బైక్ పై విధి నిర్వహణలో ఉన్న రవీందర్ ను వెనక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. హర్యానాకు చెందిన ప్రమోద్ సింగ్ వాహనాన్ని నడుపుతున్నారు. డ్రైవర్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.