షాకిచ్చిన కోర్టు‌.. ఇక ఆ సీఎం అరెస్టేనా! | delhi High Court Refuses to Quash DA Case Against HP CM Virbhadra Singh | Sakshi
Sakshi News home page

షాకిచ్చిన కోర్టు‌.. ఇక ఆ సీఎం అరెస్టేనా!

Mar 31 2017 12:00 PM | Updated on Sep 5 2017 7:35 AM

షాకిచ్చిన కోర్టు‌.. ఇక ఆ సీఎం అరెస్టేనా!

షాకిచ్చిన కోర్టు‌.. ఇక ఆ సీఎం అరెస్టేనా!

హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌, ఆయన సతీమణికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌, ఆయన సతీమణికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వారు పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను తాము అడ్డుకోలేమని, కేసును రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

అంతేకాదు, 2015, అక్టోబర్‌ 1లో ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్వరులను కూడా జస్టిస్‌ విపిన్‌ సంఘి ఎత్తివేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం గతంలో వీరభద్రసింగ్‌ను కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడంగానీ, విచారణ చేయడంగానీ, చార్జీషీట్‌ నమోదుకానీ చేయరాదు. తాజాగా ఆ ఉత్తర్వులు కూడా లేకుండా పోవడంతో ఇక సీబీఐ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. 2015 సెప్టెంబర్‌ 23న అక్రమాస్తుల కేసు వీరభద్ర సింగ్‌పై నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement