అర్థరాత్రి దినకరన్కు షాక్ | Delhi Cops At TTV Dinakaran's Door, Serve Summons Close To Midnight | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి దినకరన్కు షాక్

Apr 20 2017 8:51 AM | Updated on Sep 5 2017 9:16 AM

అర్థరాత్రి దినకరన్కు షాక్

అర్థరాత్రి దినకరన్కు షాక్

అన్నాడీఎంకే పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గెంటివేయబడ్డ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

న్యూఢిల్లీ : అన్నాడీఎంకే పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గెంటివేయబడ్డ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బుధవారం అర్థరాత్రి దినకరన్కు ఢిల్లీ పోలీసు టీమ్ సమన్లు జారీచేసింది. ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్, ఆయన క్రైమ్ బ్రాంచు టీమ్, చెన్నై నివాసంలో ఉన్న దినకరన్కు సమన్లు జారీచేసినట్టు తెలిసింది. 'రెండాకుల' గుర్తు కోసం ఎన్నికల కమిషన్కు లంచం ఇవ్వజూపాడనే కేసు విచారణ నిమిత్తం సోమవారం తమ ముందు హాజరుకావాలని ఆయన్ను క్రైమ్ బ్రాంచు టీమ్ ఆదేశించింది. 
 
ఎన్ఆర్ఐ అయిన దినకరన్ దేశం విడిచి ఎక్కడికీ ఎగిరిపోకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రధాన విమాశ్రయాలన్నింటికీ లుక్అవుట్ నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే 20 ఏళ్లుగా తన పాస్పోర్టు కోర్టులోనే ఉందని, తానెలా విదేశాలకు వెళ్తానని దినకరన్ ప్రశ్నిస్తున్నారు. అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో కోల్పోయిన పార్టీకి చెందిన 'రెండాకుల' గుర్తు తమకే వచ్చేలా  సుకేశ్ చంద్రశేఖర్తో కలిసి  ఎన్నికల కమిషన్కు రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపాడనే బండారం బట్టబయలైంది. సుకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దినకరన్ను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement