పంజాబ్‌పై కన్నేసిన ఢిల్లీ సీఎం | delhi cm arvind kejriwal visited at punjab on friday | Sakshi
Sakshi News home page

పంజాబ్‌పై కన్నేసిన ఢిల్లీ సీఎం

Feb 26 2016 10:58 PM | Updated on Aug 14 2018 5:56 PM

పంజాబ్‌పై కన్నేసిన ఢిల్లీ సీఎం - Sakshi

పంజాబ్‌పై కన్నేసిన ఢిల్లీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం పంజాబ్ రాష్ట్రంలో పర్యటించారు. ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ.. పలు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో పేదవారు, వికలాంగుల ఇళ్లకు వెళ్లిన ఆయన స్వయంగా పరామర్శించారు.

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం పంజాబ్ రాష్ట్రంలో పర్యటించారు. ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ.. పలు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో పేదవారు, వికలాంగుల ఇళ్లకు వెళ్లిన ఆయన స్వయంగా పరామర్శించారు.

అక్కడక్కడా అధికార శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకొని కేజ్రీవాల్ రాకకు నిరసన తెలిపారు. అయినా కేజ్రీవాల్ సభలకు ప్రజలు పోటెత్తారు. అధికార అకాలీదళ్, బీజేపీ కూటమిపై కేజ్రీవాల్ విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది (2017) పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారం మొదలు పెట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement