ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబైలో నిరసన ప్రదర్శనలు

Delhi and Mumbai and Hyderabad Expres Solidarity To Bengal Doctors Protest - Sakshi

న్యూఢిలీ​ : పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులపై దాడిని నిరసిస్తూ వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని వైద్యులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం పిలుపు మేరకు డాక్టర్లు ఈ సమ్మె చేపట్టారు. ఢిల్లీ సహా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రధాన నగరాల్లో వైద్యులు ఒక్క రోజు విధులు  బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిమ్స్‌లో వైద్యులు నిరసనకు దిగగా.. ఢిల్లీ మెడికల్‌ అసోసిషేయన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజు పాటు అన్ని వైద్య సేవలను నిలిపి వేయాలని పిలుపునిచ్చింది.

దేశ రాజధానిలో పలువురు రెసిడెంట్‌ వైద్యులు జంతర్‌ మంతర్‌ వద్దకు చేరి నిరసన చేపట్టారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. వైద్యుల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top