జేఎన్‌యూలో దీపికా పదుకోన్‌ | Deepika Padukone Joins Protest At JNU | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూలో దీపికా పదుకోన్‌

Jan 7 2020 8:26 PM | Updated on Jan 7 2020 8:54 PM

Deepika Padukone Joins Protest At JNU - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిని ఖండిస్తూ పుదుచ్చేరి నుంచి చండీగఢ్‌ వరకు.. అలీగఢ్‌ నుంచి కోల్‌కతా వరకు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్‌ జేఎన్‌యూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంగళవారం జేఎన్‌యూకు వెళ్లిన దీపికా వారితో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. అలాగే ఈ దాడిలో గాయపడినవారికి సంఘీభావం తెలిపారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్నారు.

చదవండి : జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన

1
1/2

2
2/2

Advertisement
 
Advertisement
Advertisement