మాజీ డీఎస్పీ కుమార్తె, కిడ్నాప్ | Daughter of retired DSP kidnapped, Rs 20 lakh demanded as ransom | Sakshi
Sakshi News home page

మాజీ డీఎస్పీ కుమార్తె, కిడ్నాప్

Mar 20 2016 4:55 PM | Updated on Sep 3 2017 8:12 PM

మాజీ డీఎస్పీ కుమార్తె, కిడ్నాప్

మాజీ డీఎస్పీ కుమార్తె, కిడ్నాప్

మాజీ డిప్యూటీ డీఎస్పీ కుమార్తెను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన హర్యానాలోని హిసార్ లో శనివారం చోటు చేసుకుంది.

హిసార్: మాజీ డిప్యూటీ డీఎస్పీ కుమార్తెను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన హర్యానాలోని హిసార్ లో శనివారం చోటు చేసుకుంది. బీఎస్ఎఫ్ విశ్రాంత డిప్యూటీ డీఎస్పీ కుమార్తె(24)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రూ.20 లక్షలు ఇస్తేనే ఆమెను వదిలిపెడతామని బెదిరించారు. బాధితురాలి ఫోన్ నుంచే కిడ్నాపర్లు ఈ డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'మా అమ్మాయి బట్టలు కొనుక్కుంటానని శనివారం సాయంత్రం తన స్కూటర్ పై మార్కెట్ కు వెళ్లింది. మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని ఆమె సెల్ ఫోన్ నుంచి కాల్ వచ్చిన తర్వాతే తెలిసింది. రూ. 20 లక్షల తీసుకుని జింద్ రోడ్డుకు రావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. ఈ విషయం నా భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశార'ని బాధిత యువతి తల్లి శకుంతలా దేవి తెలిపారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఐదు బృందాలను రంగంలోకి దించినట్టు హిసా ఎస్పీ అశ్విని షెన్వీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement