కరోనా వ్యాక్సిన్‌పై ‘జాతీయవాదం’ తగదు

The Danger of Vaccine Nationalism - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అంతర్జాతీయంగా కొన్ని వేల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇతర దేశాలకన్నా తమ దేశమే ముందుగా వ్యాక్సిన్‌ను తమ దేశ ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండుసార్లు ప్రకటించారు. తాము కూడా ఇదే వైఖరి అవలంబిస్తామని భారత్, రష్యా దేశాలు కూడా ప్రకటించాయి.

ఇలా పలు దేశాల డొమెస్టిక్‌ మార్కెట్లకు, అంటు సొంత ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని వ్యాక్సిన్‌ నేషనలిజం (వ్యాక్సిన్‌ జాతీయవాదం)గా వ్యవహరిస్తారని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ జాతీయవాదం హానికరమైనదని, అమెరికా లాంటి దేశాలకు ఇది మరింత ప్రమాదకరమని సెయింట్‌ లూహీ యూనివర్శిటీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ లా స్టడీస్‌’ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆన సంతోష్‌ హెచ్చరించారు. ఇలా సొంత దేశ ప్రజల కోసం ముందుగా వ్యాక్సిన్‌ను దక్కించుకోవాలనుకోవడం వల్ల ప్రయోగాలు విజయవంతం కాకముందే వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. (డెక్సామిథాసోన్‌ వినియోగం, వాడకానికి డబ్ల్యూహెచ్‌ఓ ఓకే‌)

జర్మనీకి చెందిన ప్రముఖ డ్రగ్‌ కంపెనీ ‘క్యూర్‌వాక్‌’ను గత మార్చి నెలలోనే వైట్‌హౌజ్‌ ప్రతినిధులు కలుసుకొని వ్యాక్సిన్‌ విషయమై చర్చలు జరిపారు. ఆ కంపెనీ తయారు చేయనున్న కరోనా వ్యాక్సిన్‌పై తమకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఇవ్వాలంటూ బేరమాడారు. ఈ విషయం తెల్సిన జర్మనీ ప్రభుత్వం ‘జర్మనీని అమ్మకానికి పెట్టలేదు’ అంటూ తీవ్రంగా స్పందించింది. అలాగే అమెరికాకు చెందిన ‘బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ ఫ్రెంచ్‌ కంపెనీ సనోఫీకి కరోనా వైరస్‌ కోసం ముందస్తు చెల్లింపులు జరిపింది. దాంతో తాము కనిపెడుతున్న వ్యాక్సిలో ఎక్కువ భాగం ముందుగా అమెరికాకే వెళుతుందని ఆ కంపెనీ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. దాంతో ఆ కంపెనీపై ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీ తన వైఖరిని మార్చుకుంది. (కరోనాకు ఇందులో ఏది సరైన మందు?)

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోత్సహించే లేదా సిఫార్సు చేసే బయోటెక్‌ కంపెనీల జోలికి వెళ్లవద్దని అమెరికా, భారత్, రష్యా దేశాలు నిర్ణయించాయి. భారత్‌కు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో ఉంది. ఆ వ్యాక్సిన్‌లో అధిక భాగాన్నే దేశీయ అవసరాలకే ఉపయోగించాలంటూ ఇప్పటికే భారత్‌ ప్రభుత్వం ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇలా ప్రతి దేశం తమ దేశానికి చెందిన కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఫర్వాలేదుగానీ, అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు, అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం ప్రమాదమని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. దాని వల్ల అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడలేని దేశాలు బాగా దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్‌ జాతీయవాదం కొత్తగా వచ్చింది కాదని, 2009లో కూడా ఇదే జరిగిందని వారు చెబుతున్నారు.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-11-2020
Nov 28, 2020, 04:53 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి...
28-11-2020
Nov 28, 2020, 04:26 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు...
28-11-2020
Nov 28, 2020, 03:27 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ముందు చూపుతో వ్యవహరించి వైరస్‌...
27-11-2020
Nov 27, 2020, 17:34 IST
న్యూఢిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్‌ డీల్‌ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు...
27-11-2020
Nov 27, 2020, 13:50 IST
మాస్కో/ హైదరాబాద్‌: దేశీయంగా రష్యన్‌ వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్‌ డైరెక్ట్‌...
27-11-2020
Nov 27, 2020, 11:47 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 కోవిడ్‌...
27-11-2020
Nov 27, 2020, 10:44 IST
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం...
27-11-2020
Nov 27, 2020, 09:26 IST
ముంబై, సాక్షి: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే మార్చికల్లా కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ను విడుదల చేసే వీలున్నట్లు దేశీ ఫార్మా...
27-11-2020
Nov 27, 2020, 08:22 IST
అహ్మదాబాద్‌: గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు కరోనా పేషెంట్లు...
27-11-2020
Nov 27, 2020, 08:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : రోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు...
26-11-2020
Nov 26, 2020, 19:24 IST
‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప...
26-11-2020
Nov 26, 2020, 16:35 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్‌మాస్క్‌ ధరించడం అనివార్యంగా మారిపోయింది.
26-11-2020
Nov 26, 2020, 13:30 IST
న్యూయార్క్‌: కరోనా వైరస్‌ కట్టికి బ్రిటిష్‌, స్వీడిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్‌ఫర్డ్‌...
26-11-2020
Nov 26, 2020, 13:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ అమ్మకాలకు కరోనా వైరస్‌ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌లో...
26-11-2020
Nov 26, 2020, 12:07 IST
సింగపూర్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్‌ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు...
26-11-2020
Nov 26, 2020, 10:02 IST
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో...
26-11-2020
Nov 26, 2020, 09:54 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి....
26-11-2020
Nov 26, 2020, 08:25 IST
భోపాల్‌: కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో మహమ్మారి బారిన పడిన ఓ యువ వైద్యుడు కన్నుమూశాడు. నెలరోజుల పాటు...
26-11-2020
Nov 26, 2020, 04:28 IST
గుంటూరు మెడికల్‌:  కోవిడ్‌–నివారణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ బుధవారం గుంటూరు...
26-11-2020
Nov 26, 2020, 02:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకాను మొదటి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top