మంత్రిగారిపై దోపిడీ కేసు!! | Dacoity case slapped on UP minister | Sakshi
Sakshi News home page

మంత్రిగారిపై దోపిడీ కేసు!!

Jun 26 2014 1:20 PM | Updated on Aug 25 2018 5:10 PM

ఓ వ్యక్తిని బెదిరించి, దోపిడీ చేసినందుకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలోని ఓ సీనియర్ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఓ వ్యక్తిని బెదిరించి, దోపిడీ చేసినందుకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలోని ఓ సీనియర్ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ మత్స్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఇక్బాల్ మసూద్పై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కేసు పెట్టారు. అయితే సర్వసాధారణంగానే మంత్రిగారు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

దాదాపు 15 మంది అనుచరులతో కలిసి ఓ న్యాయవాది ఇంట్లోకి చొచ్చుకెళ్లి, ఆయనను బెదిరించి, విలువైన వస్తువులన్నీ దోచుకున్నట్లు ఇక్బాల్ మసూద్పై కేసు నమోదైంది. మంత్రిగారి దిష్టిబొమ్మను దహనం చేసినందుకు తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మే 28న తనను ఆయన బెదిరించినట్లు నూతన్ విజయ్ అనే ఆ న్యాయవాది అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో తన ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో సదరు మంత్రిపైన, ఆయన అనుచరులపైన కేసు పెట్టాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement