‘సైరస్’ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం | Cyrus charitable organization celebrate Children's Day | Sakshi
Sakshi News home page

‘సైరస్’ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

Nov 15 2014 12:17 AM | Updated on Sep 2 2017 4:28 PM

‘సైరస్’ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

‘సైరస్’ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

స్థానిక మండవాలీలోని బాలభారతి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది.

సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక  మండవాలీలోని బాలభారతి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. సైరస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పనిమనుషులు, రిక్షాకార్మికులు, ఇతర కూలీ పనులు చేసుకునే వారి చిన్నారుల కోసం శశిచంద్రన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని సైరస్ సభ్యులు తెలిపారు. బాలల దినోత్సవ ప్రత్యేకతను సైరస్ సభ్యురాలు సుగుణ చిన్నారులకు వివరించారు.

అదేవిధంగా భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ్‌భారత్ కార్యక్రమాన్ని గురించి తెలియజేశారు. చిన్నారులు తమ తరగతి గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చాచా నెహ్రూ జీవిత విశేషాలపై చిన్నారులకు క్విజ్ పోటీ నిర్వహించారు. విజేతలకు సైరస్ తరఫున బహుమతులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఉజ్వల అగర్వాల్, ఆరాధ్య, ఆద్దేయి తదితరులు పాల్గొన్నారు.
 
ఆంధ్రా బ్యాంక్ ఆధ్వర్యంలో
ఆంధ్రాబ్యాంక్ కరోల్‌బాగ్‌శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్‌నగర్ ఏఈఎస్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులోభాగంగా బ్యాంకు తరఫున ఏబీ టీన్ (15-18 ఏళ్ల వారికి), ఏబీ లిటిల్‌స్టార్స్ (10-15ఏళ్ల వారికి) పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు సిబ్బందితోపాటు ఏఈఎస్ పాఠశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement