బెంగాల్ లో బాంబుల మోత:ముగ్గురి మృతి | crude bomb exploded in West Bengal: 3 killed | Sakshi
Sakshi News home page

బెంగాల్ లో బాంబుల మోత:ముగ్గురి మృతి

Mar 8 2016 10:22 AM | Updated on Sep 3 2017 7:16 PM

మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్ లో హింస చెలరేగింది.

ముర్షిదాబాద్: మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్ లో హింస చెలరేగింది. అయితే నిత్యం చోటుచేసుకునే తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంల సంఘర్షణలా కాకుండా ఈసారి ఒకే పార్టీకి చెందిన రెండు గ్రూపులు నాటు బాంబులు విసురుకున్నాయి. ముర్షిదాబాద్ జిల్లా భరత్ పూర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఒక వర్గం లక్ష్యంగా మరొక వర్గం విసిరిన నాటుబాంబులు పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పేలుడు సమాచారం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే  పలు గ్రామాల్లో విపక్ష పార్టీ సీపీఎం సభ్యులతో తన్నులాటలకు దిగుతోన్న తృణమూల్ కాంగ్రెస్.. స్వపక్షంలో గ్రూపు తగాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పార్టీ ఆందోళనలో పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement