చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు | Criyanka Chopra Dancing With Ava | Sakshi
Sakshi News home page

చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు

Jun 16 2019 5:09 PM | Updated on Jun 16 2019 8:05 PM

Criyanka Chopra Dancing With Ava - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు సంపాధించుకున్నబాలీవుడ్‌ అందాల భామ ప్రియాంక చోప్రా ఓ చిన్నారితో డాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హాలీవుడ్‌ సింగర్‌, ప్రియాంక భర్త నిక్‌ జోన్స్‌ మేనేజర్‌ కూతురు అవాకు డాన్స్‌ నేర్పుతున్న వీడియో ఇది. ఈ వీడియోలో 1998 నాటి బాలీవుడ్‌ హిట్‌ మువీ ‘మేజర్‌ సాబ్‌’లోని ‘సోనా సోనా’ పాటకు ఎలా డాన్స్ చేయాలో అవాకు ప్రియాంక నేర్పుతున్నారు.

ఇక, ప్రియాంక చోప్రా గత నెల ‘వాంగో టాంగో’ కాన్సర్ట్‌లో తన భర్త నిక్‌ జోన్స్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘ రోమియో హో రోమిమో’ అంటూ పోస్ట్‌ చేసింది. సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక .. తన భర్త నిక్‌ జోన్స్‌ చేతిని మురిపెంగా పట్టుకున్న ఫోటోను ‘హోమ్‌ స్వీట్‌ హోమ్‌’ అంటూ షేర్‌ చేసింది. నిక్‌తో ప్రియాంక హైహీల్స్‌ వేసుకొని మోకాలుకు బాండేజ్‌ కట్టుకొని చేతిలో డియారో బహుమతి బ్యాగ్‌ని పట్టుకొని శనివారం నగరాన్ని సందర్శించి సందడి చేసింది.  ఇటీవల ప్రియాంక ‘ఇజ్‌నాట్‌ ఇట్‌ రోమాంటిక్‌’ అనే హాలీవుడ్‌ మూవీలో నటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement