'చంపింది దళితులు కాదు.. సింహాలు' | Cow skinned by Dalits in Una was killed by lions, says Guj CID | Sakshi
Sakshi News home page

'చంపింది దళితులు కాదు.. సింహాలు'

Jul 27 2016 5:38 PM | Updated on Aug 21 2018 2:39 PM

పార్లమెంటును కుదిపేలా చేసినా గుజరాత్ లోని వూనా ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి.

అహ్మదాబాద్: పార్లమెంటును కుదిపేలా చేసినా గుజరాత్ లోని వూనా ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. వూనాలో ఆవును దళితులు వదించలేదని, సింహాలు చంపేశాయని, అలా సింహాల చేతిలో చనిపోయన గోవు చర్మాన్ని మాత్రమే దళితులు తీసుకొచ్చుకున్నారని సీఐడీ అధికారులు చెప్పారు.

తమ దర్యాప్తులో ఓ ప్రత్యక్ష సాక్షి ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటనపై వివరాలను సీఐడీ ప్రధాన అధికారి ఎస్ఎస్ త్రివేది వెల్లడిస్తూ 'దర్యాప్తు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే జూలై 10, 11న సింహాలు వేర్వేరు ప్రాంతంలో నాలుగు ఆవులుపై దాడులు చేసి చంపేశాయి. వీటిల్లో మోటా సమాదియాల చచ్చిపడివున్న ఆవు వద్దకు వెళ్లిన దళితులు దాని మృత కళేబరాన్ని తీసుకొచ్చుకున్నారు. అంతేగానీ, వారే స్వయంగా ఆ గోవును చంపలేదు' అని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement