CoronaVirus Death Toll in India | 24 గంటల్లో 32 మంది మృతి | COVID 19 Deaths in India - Sakshi Telugu
Sakshi News home page

కరోనా.. 24 గంటల్లో 32 మంది మృతి 

Apr 8 2020 4:42 PM | Updated on Apr 8 2020 5:23 PM

Coronavirus : Love Agarwal Releases Health Bulletin - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 773 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 5,194 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా హెల్త్‌ బులిటెన్‌కు సంబంధించి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గడిచిన 24 గంటల్లో 32 మంది కరోనా బాధితులు మృతిచెందారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 149కి చేరిందన్నారు. అయితే కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో 80 శాతం మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఇప్పటివరకు 402 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement