కరోనా కోరల్లో ముంబై బస్సు సిబ్బంది

Corona Virus Attack On Mumbai Bus Service - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బెస్ట్‌ పబ్లిక్‌ బస్‌ సర్వీసెస్‌ పరిధిలోని దక్షిణ ముంబై డిపోలో కండక్టర్‌గా పని చేస్తోన్న కిషన్‌ కుంభ్‌కర్‌ కరోనా వైరస్‌ బారిన పడి మే 13వ తేదీన మరణించారు. ఆయనతో ఆ డిపోకు చెందిన ఎంతో మంది కండక్టర్లు, డ్రైవర్లు కలిసి మెలిసి తిరిగారు. వారందరికి సకాలంలో గుర్తించి క్వారెంటైన్‌కు పంపించలేదు. ఫలితంగా ఎక్కువ మందికి కరోనా వైరస్‌ వ్యాపించినట్లు తెలుస్తోంది. బెస్ట్‌ బస్‌ సర్వీసు ముంబై మున్సిపాలిటీ పరిధిలో 1200 బస్సు సర్వీసులను నడుపుతోంది. దాదాపు ఆరువేల మంది కండక్లర్లు, డ్రైవర్లు, డిపో సిబ్బంది పని చేస్తున్నారు. (సడలింపులకు గ్రీన్‌ సిగ్నల్‌)

అధికారిక లెక్కల ప్రకారం బెస్ట్‌ పబ్లిక్‌ బస్‌ సర్వీసెస్‌కు చెందిన 128 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. 63 మంది కోలుకున్నారు. ఎనిమిది మంది మరణించారు. 971 మంది క్వారెంటైన్‌ పూర్తి చేసుకొని తిరిగి విధుల్లో చేరగా, మరో వెయ్యి మంది క్వారెంటైన్‌లో ఉన్నారు. కరోనా వైరస్‌ బారిన పడి తమ సిబ్బంది కనీసం 19 మంది చనిపోయి ఉంటారని, కరోనా బారిన పడిన వారి సంఖ్య అధికారులు చెబుతున్న 128 కన్నా ఎక్కువే ఉంటుందని బెస్ట్‌ వర్కర్స్‌ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. (మహమ్మారితో వణుకుతున్న మహారాష్ట్ర)

తమ సిబ్బందిలో మొదటి కేసు బయట పడిన మే 13వ తేదీనాడే అధికార యంత్రాంగం స్పందించి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదని వారు అభిప్రాయపడ్డారు. వైరస్‌ బారిన పడిన కండక్టర్ల కారణంగా సాదారణ ప్రజలు ఎంత మందికి ఈ వైరస సోకిందేమోనన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తం అవుతోంది. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top