ఇస్లాంలోకి మారకుంటే కాళ్లు, చేతులు నరికేస్తాం | 'Convert to Islam within six months': Malayali Author KP Ramanunni | Sakshi
Sakshi News home page

ఇస్లాంలోకి మారకుంటే కాళ్లు, చేతులు నరికేస్తాం

Jul 23 2017 2:04 AM | Updated on Aug 28 2018 7:24 PM

ఆరు నెలల్లోగా ఇస్లాం మతం స్వీకరించకుంటే కాళ్లు, చేతులు నరికేస్తామం టూ కేరళ రచయిత కేపీ రామనుణ్నికి బెదిరింపులు వచ్చాయి.

కోజికోడ్‌: ఆరు నెలల్లోగా ఇస్లాం మతం స్వీకరించకుంటే కాళ్లు, చేతులు నరికేస్తామం టూ కేరళ రచయిత కేపీ రామనుణ్నికి బెదిరింపులు వచ్చాయి. కోజికోడ్‌కు చెందిన ఆయన... మతం పేరిట హిందూ ముస్లింలు ఘర్షణకు దిగవద్దంటూ స్థానిక పత్రికలో వ్యాసం రాయడంతో వారం క్రితం అజ్ఞాత వ్యక్తులెవరో ఇలా హెచ్చరిస్తూ లేఖ పంపారు. ‘నిష్పక్షపాతం పేరిట మీరు హిందూ , ముస్లింలను ఒకే గాటన లెక్క కట్టారు. ఇలాంటి రాతలు అమాయక ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

మీకో అవకాశం ఇస్తున్నాం... ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి మారండి లేదంటే అల్లా తరఫున శిక్ష విధిస్తాం. మీ కాళ్లు, చేతులను నరికేస్తాం’ అని అందులో బెదిరించారు. హత్యా బెదిం పులను సహించబోమని, ఇలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తామని సీఎం పి.విజయన్‌ అన్నారు. రామనుణ్ని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement