మోదీపై కాంగ్రెస్‌ సంచలన వ్యాఖ్యలు

Congress Says Chowkidar Who Allowed Vijay Mallya To Flee Is Chor - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు టోకరా వేసిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా విదేశాలకు పారిపోయేందుకు కాపలాదారని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ అనుమతించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రధాని మోదీ బృందంలో నలభై మంది దొంగలున్నారని.. మోదీ బాబా నలభై దొంగలని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా మంగళవారం ట్విటర్‌లో తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని ట్వీట్‌ చేశారు. విజయ్‌ మాల్యాను దేశం నుంచి పారిపోయేందుకు సహకరించిన కాపలాదారు (మోదీ) దొంగ అన్నారు. మోదీ బాబా, నలభై దొంగలు చేసిందేమీ లేదని, చెప్పుకునేందుకు ఏమీ లేక ట్విటర్‌లో వారి పేర్లు మార్చుకుంటున్నారని విమర్శించారు. నినాదాలను పదేపదే మార్చేందుకు ప్రయత్నించే మోదీ తన బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతుంటారని ఎద్దేవా చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top