రైల్లో చోరీ.. ఎమ్మెల్యేలు లబోదిబో | Congress MLAs say their belongings stolen from Gour Express | Sakshi
Sakshi News home page

రైల్లో చోరీ.. ఎమ్మెల్యేలు లబోదిబో

Jan 6 2017 5:17 PM | Updated on Mar 18 2019 7:55 PM

పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రైల్లో తమ వస్తువులు పోయాయంటూ లబోదిబోమంటున్నారు.

పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రైల్లో తమ వస్తువులు పోయాయంటూ లబోదిబోమంటున్నారు. సీల్డా నుంచి మాల్డా వెళ్లే గౌర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండు వేర్వేరు ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆసిఫ్ మెహబూబ్, సమర్ ముఖర్జీలకు ఈ చేదు అనుభవం ఎదురైంది. 
 
ఈ విషయాన్ని జీఆర్పీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైలు రాంపుర్హట్-నల్హాటి స్టేషన్ల మధ్య ఉండగా తన ట్యాబ్ పోయిందని ఆసిఫ్ మెహబూబ్ చెప్పారు. ఇక తన ఓటరు గుర్తింపుకార్డు, ఎస్‌బీఐ పాస్‌బుక్, కొంత నగదు పోయినట్లు సమర్ ముఖర్జీ తెలిపారు. రెండు ఫిర్యాదులపై తాము దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement