మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు కరోనా | Congress leader Abhishek Manu Singhvi tests Corona Positive | Sakshi
Sakshi News home page

మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు కరోనా పాజిటివ్‌!

Jun 26 2020 7:14 PM | Updated on Jun 26 2020 7:31 PM

Congress leader Abhishek Manu Singhvi tests Corona Positive - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వి కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే కరోనా వైరస్‌ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు సమాచారం. ఆయన కార్యాలయంలో పనిచేసే వారందరికి కరోనా నెగిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతక ముందు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝ కూడా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ కూడా కరోనా వైరస్‌ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్లాస్మా థెరపీ చికిత్స చేశారు. శుక్రవారం ఆయనను మరోసారి పరీక్షించగా కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను డిశార్జ్‌ చేయనున్నారు.  (మాజీ ఎంపీ వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement