ఎస్‌పీతో కాంగ్రెస్ పొత్తు | Congress aligns with SP in Maharashtra | Sakshi
Sakshi News home page

ఎస్‌పీతో కాంగ్రెస్ పొత్తు

Sep 26 2014 11:16 PM | Updated on Sep 2 2017 2:00 PM

ఎన్సీపీ తమ నుంచి విడిపోవడంతో ఇక సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

న్యూఢిల్లీ: ఎన్సీపీ తమ నుంచి విడిపోవడంతో ఇక సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబూ ఆసిమ్ అజ్మీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను కలిసి చర్చలు జరిపారని సమాజ్‌వాదీ ప్రతినిధి అబ్దుల్ ఖాదిర్ చౌదరి చెప్పారు.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆయన అన్నారు. శివాజీనగర్-మన్‌ఖుర్ద్ నుంచి అబూ ఆజ్మీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీవండి, కుర్లా, మిరాజ్, నాగపూర్ సెంట్రల్ స్థానాలను తాము కోరుతున్నామని చెప్పారు. విదర్భలో ప్రాబల్యం ఉన్న జోగేంద్ర కవాడే, సులభ కుంభారేలతో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement