ఒడిశాలో మ‌ళ్లీ లాక్‌డౌన్  | Complete Lockdown In Parts Of Odisha From July 17 To Till 31 | Sakshi
Sakshi News home page

ఒడిశాలో మ‌ళ్లీ లాక్‌డౌన్ 

Jul 17 2020 4:28 PM | Updated on Jul 17 2020 4:53 PM

Complete Lockdown In Parts Of Odisha From July 17 To Till 31 - Sakshi

క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌ధ్యంలో ఒడిశా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

భువ‌నేశ్వ‌ర్ :  రాష్ర్టంలో క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌ధ్యంలో ఒడిశా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా ప్ర‌భావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈనెల 17నుంచి 31 వ‌ర‌కు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స‌ర్కార్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఒడిశాలోని గంజామ్‌, ఖోర్ధా, క‌ట‌క్‌, జాజ్‌పూర్ జిల్లాల‌తోపాటు రూర్కెలా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్రాంతాల్లో శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అసిత్ త్రిపాఠి తెలిపారు.

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు స‌హా అన్ని వ్యాపార దుకాణాలు మూసివేయాల‌న్నారు. ప్ర‌జ‌లు కూడా వంద శాతం దీనికి స‌హ‌క‌రించాల‌ని స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాల‌ని కోరారు. నిత్యావ‌సరాలు ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తి ఉంద‌న్నారు. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామ‌ర్స్ సేవ‌లకు సైతం అనుమ‌తి ఉంటుంద‌ని ఉత్త‌ర్వులో పేర్కొంది. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండ‌నున్న జిల్లాలో ప‌క‌డ్భందీగా ఆంక్ష‌లు పాటించేలా ఇప్ప‌టికే ఆయా జిల్లా ఎస్పీల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇక  ఒడిషా వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 15,392కు చేరుకుంది. గ‌త 24 గంట‌ల్లోనే 494 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా ఇద్ద‌రు మ‌ర‌ణించిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. (కరోనా: అత్యంత ప్రమాదకర జిల్లాల రాష్ట్రాలివే! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement