ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కల్నల్ మృతి | Colonel Killed in Encounter in Jammu and Kashmir's Kupwara | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కల్నల్ మృతి

Nov 17 2015 5:08 PM | Updated on Sep 3 2017 12:37 PM

ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కల్నల్ మృతి

ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కల్నల్ మృతి

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉత్తర కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మణిగావ్‌ అడవుల్లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ కల్నల్‌ వీరమరణం పొందారు. ఉదయం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ప్రాంతంలో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదుల్లో అడవుల్లో నక్కి.. వారి కోసం గాలిస్తున్న భద్రతా దళాలపై కాల్పులకు దిగారు.

గతవారం ఇదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. అప్పుడు భద్రతా దళాలను ఎదుర్కొన్న ఉగ్రవాదులే.. తాజాగా ఎన్‌కౌంటర్‌లోనూ పాల్గొన్నట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదుల బృందమే  భద్రతాదళాలతో ఎదురుకాల్పులకు దిగుతున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement