కోలీ మరణశిక్ష యావజ్జీవ ఖైదుగా మార్పు | Coli death penalty, life imprisonment change | Sakshi
Sakshi News home page

కోలీ మరణశిక్ష యావజ్జీవ ఖైదుగా మార్పు

Jan 29 2015 3:00 AM | Updated on Aug 31 2018 8:24 PM

నిఠారీ సీరియల్ హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ శిక్షను అలహాబాద్ హైకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది.

అలహాబాద్: నిఠారీ సీరియల్ హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ శిక్షను అలహాబాద్ హైకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది. కోలీ క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరిగిందంటూ ఈ నిర్ణయం తీసుకుంది. 2006లో జరిగిన హత్యలపై కోలీకి 2009లో సీబీఐ కోర్టు మరణశిక్ష విధించింది.కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరగటం వల్ల అతనికి మరణశిక్షను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement