తప్పే: తబ్లిగీ జమాత్‌పై యోగీ ఫైర్‌! | UP CM Yogi Adityanath Comments Over Tablighi Jamaat | Sakshi
Sakshi News home page

తబ్లిగీ చేసిన పనిని ఖండిస్తున్నా : యోగీ

May 2 2020 5:07 PM | Updated on May 2 2020 6:34 PM

UP CM Yogi Adityanath Comments Over Tablighi Jamaat - Sakshi

లక్నో : గత మార్చిలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగటానికి జామాతే కారణమంటూ మండిపడ్డారు. శనివారం జరిగిన ‘ఈ ఎజెండా ఆజ్‌తక్’‌ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ తబ్లిగీ జమాత్‌ చేసిన పనిని ఖండిస్తున్నా. తబ్లిగీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండిఉంటే లాక్‌డౌన్‌ మొదటి దశలోనే కరోనాను కట్టడి చేసేవాళ్లం. తబ్లిగీ జమాత్‌ చేసింది నేరం.. సభ్యులు కచ్చితంగా శిక్షింపబడాలి. రాష్ట్రంలో దాదాపు 3,000 మంది తబ్లిగీ జమాత్‌ సదస్సుతో సంబంధం ఉన్నవారు ఉన్నారు.

రోగం తెచ్చుకోవటం నేరం కాదు. కానీ, దాన్ని దాచిపెట్టడం కచ్చితంగా నేరమే. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటా’’మని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు  2,328మంది కరోనా వైరస్‌ బారినపడగా, 654మంది కోలుకున్నారు. దాదాపు 42మంది మృత్యువాత పడ్డారు. 

చదవండి : తబ్లిగీ సభ్యులపై పొగడ్తలు: అధికారికి నోటీసులు 

Advertisement
 
Advertisement
Advertisement