తెరుచుకోనున్న కంటోన్మెంట్‌ దారులు | Closed roads opened to public in cantonments | Sakshi
Sakshi News home page

తెరుచుకోనున్న కంటోన్మెంట్‌ దారులు

May 21 2018 5:21 AM | Updated on May 21 2018 5:21 AM

Closed roads opened to public in cantonments - Sakshi

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా మూసేసిన అన్ని కంటోన్మెంట్‌ దారులను వెంటనే తెరవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఇటీవల మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటన వెలువడింది. కంటోన్మెంట్లు, అక్కడి దారుల మూసివేతపై నిర్వహించిన ఈ భేటీకి 62 కంటోన్మెంట్ల ఉపాధ్యక్షులు, ఆ ప్రాంత ఎంపీలు హాజరయ్యారు. ఇకపై ఒక్కో కంటోన్మెంట్‌ దారి మూసివేతను సంబంధిత చట్టంలోని నిబంధనలను అనుసరించి సమీక్షించాలని నిర్ణయించారు.  స్థానికులు, సైనికుల ఫిర్యాదులు, అవసరాలను ఉమ్మడిగా పరిష్కరించేందుకు ప్రామాణిక విధానాన్ని అమల్లోకి తేవాలని కూడా నిర్ణయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement